చనిపోయిన మంథని రాజేందర్ కుటుంబానికి 10.000 (పదివేల) రూపాయల ఆర్థిక సాయం అందజేసిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మంథని రాజేందర్ గారు ఇటీవల గుండెపోటుతో చనిపోవడంతో తనపై ఆధారపడిన అతని భార్య ఇద్దరు చిన్న పిల్లలు మరియు వృద్ధులైన అమ్మానాన్నలు ఉన్నారు రాజేందర్ గారు కులవృత్తి అయిన కటింగ్ షాప్ నడుపుకుంటూ ఇంటిని పోషించుకునేవాడు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో వారి నిరుపేద కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా మారడంతో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10.000 పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమానికి రెబల్ రాజేందర్, బంధుగుల సంతోష్, బల్ల శ్రావణ్, రామకృష్ణ, దడిగెల పవన్, అడ్డూరి కృష్ణయ్య, సందీప్, తదిఇతర సభ్యులు పాల్గొన్నారు