ప్రజా యుద్ధ నౌక గద్దరన్న యాదిలో…
-సింగూరు పాండు ఆధ్వర్యంలో నివాళులర్పించిన డా. బి.ఆర్. అంబేద్కర్ సంఘం, దయార్ గూడ
– కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల రమేష్ పాల్గొన్నారు
కూకట్పల్లి 06 ఆగస్టు ( ప్రశ్న ఆయుధం): ప్రజ యుద్ధ నౌక గద్దర్ అన్న 2వ వర్ధంతిని పురస్కరించుకొని సింగూరు పాండు ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్క్ లో గద్దర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహ నిత్యమాల కన్వినర్ సింగూరు పాండు కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ 121డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, పాల్గొని నివాళులర్పించారు. భారతీయ జనత పార్టీ జిల్లా నాయకులు జక్కుల వినయ్ మాట్లాడుతూ: కడుపులో తూటా పెట్టుకొని బుల్లెట్ లాంటి పాటలతో ప్రభుత్వలనే గడగడలాడించిన ప్రజా పోరాట యోధుడు మన గద్దరన్న .. తన అట పాటలతో తెలంగాణా సమాజాన్నే కాకుండా పలు రాష్ట్రల ప్రజలను సైతం చైతన్యం పరచిన మన బహుజన గొంతు గుమ్మడి విఠల్ , అటువంటి మహానుబావుని వర్ధంతి నేడు, ఆటపాట రూపంలో అయన ఎప్పటికి ప్రజల మనసులో చిరస్థాయిగా సజీవంగా ఉంటారని కొనియాడారు, అయన పోరాటలను గుర్తిస్తూ గద్దర్ జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాల సంతోషకరమని అలాగే నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న సినీమా రంగంలో ఆర్టిస్టులకు ఇచ్చే అవార్డుల పేరును గద్దర్ అవార్డ్స్ పేరుతో ఇస్తూ అవార్డుల గౌరవాన్ని మరింత పెంచారని అన్నారు. అయన చరిత్రను భావి తరాలకు ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరారు. కార్యక్రమం మొదట్లో మేకల మహేష్ బాబు, మేకల రమేష్ అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి జ్ఞానమాల వేసి జ్ఞాన జ్యోతినీ వెలిగించగ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులలో పోతురాజు రమేష్, బుద్ద వందనం చేశారు. కార్యక్రమంలో సమత సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు లఖన్, జర్నలిస్ట్ సోదరులు మద్ద అనిల్ కిషోర్ కుమార్, యోహాన్ దండే, మద్దెల గిరి, అంబేద్కర్ సంఘం సభ్యులు గుణగుంట యాదగిరి, అక్కపల్లి రాము, కొండల్, జ్ఞానమాల కార్య నిర్వహణ సభ్యులు బేగారి నర్సింహా, పసులది రాములు తదితరులు పాల్గొని గద్దరన్న చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.