భారత గడ్డపై ఎర్ర జెండాకు వందేళ్లు
అశ్వాపురం మండలం లో *
*సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు*
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి ప్రజా ఉద్యమాలే సీపీఐ ఆయుధం.
త్యాగాలతోపునీతమైన చరిత్ర సిపిఐది.
సిపిఐ మండలం కార్యదర్శి అనంతనేని సురేష్
:అశ్వాపురం మండలం, ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధమని, మనిషిని మనిషి దోపిడి చేయని సమసమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ,సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్ పునరుద్దాటించారు. సిపిఐ 100 వ ఆవిర్భావ వార్నికోత్సవాలను అశ్వాపురం మండలం లో ఆటో సెంటర్లో, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేటు ఎదురుగా, కాలువ బజార్లో, మల్లెలమడుగు సెంటర్లో, మొండికుంట సెంటర్లో, అమేర్ధ కాలనీలో, వివిధ ప్రాంతాలలో ఘనంగా అరుణ పతాకాల ఆవిష్కరణలు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు.
దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 100 ఏండ్ల సుధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు,,
ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, వేల్పుల మల్లికార్జున్, రెడ్డి అరుణ, నెల్లిపోక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్,
సిపిఐ మండల సహాయ కార్యదర్శులు, అనంతనేని శేఖర్,మేలపుర సురేందర్ రెడ్డి, రాయపూడి రాజేష్, చెలికాని శ్రీనివాస్, ముత్తబోయిన వెంకటేశ్వర్లు, అమేర్ధ పంచాయతీ మాజీ సర్పంచ్ బండ్ల సీతమ్మ, బండ్ల తిరుమలరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి,
ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి, అక్కనపల్లి నాగేంద్రబాబు, ఏఐవైఎఫ్ మండల నాయకులు, రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్ కుమార్,
ఏఐటీయూసీ మండల నాయకులు ముద్దుశెట్టి నరసింహారావు,
సిపిఐ మండల నాయకులు, తేలం వెంకటరమణ, ఇరుగు శ్రీకాంత్, కంగాల లక్ష్మయ్య,మిత్తుల జి ఆర్, శెట్టి విజయ్, సబ్కా నవీన్, సాయి, పుల్లారావు, ఇరుగు గోపయ్య,
తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వార్షికోత్సవాలు
by Naddi Sai
Published On: December 26, 2024 6:49 pm