అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టిన యువకుడు
ప్రశ్న ఆయుధం 09 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ నియోజకవర్గం దుర్కి గ్రామానికి చెందిన చెందిన ఒక యువకుడు వినూత్నంగా అన్నాచెల్లెలు బంధాన్ని గుర్తుచేశారు.రాఖీ పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన తెలంగాణ స్టూడెంట్ పరిషత్ అధ్యక్షులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి స్వయంగా రాఖీ కట్టారు.అంబేద్కర్ సమాజానికి సమానత్వం,సోదరభావం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడని, ఆయనను అన్నగా భావించి కుమారుడు సాయి తేజ్, కుమార్తె వర్షిని తో కలిసి రాఖీ కట్టడం తనకు గర్వకారణమని తెలిపారు.ఈ సంఘటన స్థానిక ప్రజల్లో ఆసక్తి రేపగా, పలువురు యువకుడి ఆలోచనను అభినందించారు.అన్నాచెల్లెలు బంధం రక్తసంబంధాలకే పరిమితం కాకుండా,స్ఫూర్తిదాతలతోనూ ఏర్పడవచ్చని ఈ చర్య ద్వారా సందేశం అందించారు.