Site icon PRASHNA AYUDHAM

IMG 20250810 WA0013

అర టన్ను సొర.. రూ.34 వేల ధర

ఆగష్టు 10,  ఆంధ్రప్రదేశ్ : అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం మత్స్యకారుల గాలానికి శనివారం భారీ సొర చేప చిక్కింది. దాన్ని చూసి తొలుత భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి.. లాక్కొచ్చారు. ఈ 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు మడ్డు నూకరాజు వివరించారు.

Exit mobile version