నిజామాబాద్ లో వీడియో జర్నలిస్టుల కమిటీ ఏకగ్రీవం

నిజామాబాద్ లో వీడియో జర్నలిస్టుల కమిటీ ఏకగ్రీవం

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం), సెప్టెంబర్ 3:

నిజామాబాద్ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు రవి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీడియో జర్నలిస్టుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా 99 టీవీకి చెందిన పెరుమాండ్ల నగేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏబీఎన్ ప్రతినిధి పులి అనిల్, కోశాధికారిగా ఐ న్యూస్‌కి చెందిన పి.శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే6 ప్రతినిధి అభిలాష్, వైస్ ప్రెసిడెంట్‌గా టీవీ9కి చెందిన మామిడాల అరవింద్, జాయింట్ సెక్రటరీగా సాక్షి టీవీ ప్రతినిధి బొడ్డుల సాయి కిరణ్లను ఎన్నుకున్నారు.

ఇక మిగతా సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఐకమత్యం, సహకారం ప్రతిఫలించిందని సభ్యులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment