Site icon PRASHNA AYUDHAM

నేటి ప్రజావాణి లో 106 దరఖాస్తులు స్వీకరణ.

IMG 20251027 WA0183

-నేటి ప్రజావాణి లో 106 దరఖాస్తులు స్వీకరణ

 

– ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలి

 

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్

అక్టోబర్ 27 (ప్రశ్న ఆయుధం):

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం మొత్తం 106 దరఖాస్తులు స్వీకరించబడ్డాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ మండలాల నుండి వచ్చి తమ సమస్యలను వివరించారు. దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్, సంబంధిత శాఖాధికారులకు అందజేస్తూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణం పరిష్కరించాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version