Site icon PRASHNA AYUDHAM

IMG 20250905 173847

గ్రామాలలో ఆధ్యాత్మిక చైతన్యం – సంప్రదాయాల రక్షణ

నెంటూర్ గ్రామంలో మట్టి గణపతికి ప్రత్యేక గుర్తింపు

రామకోటి రామరాజును సన్మానించిన హనుమాన్ భక్త బృందం

వర్గల్ మండలం నెంటూర్‌లో మట్టి గణపతి ప్రతిష్ఠ – ఆదర్శ గ్రామం గుర్తింపు

పల్లకిలో గణపతి ఊరేగింపు, భజనలతో నిమజ్జనం – ప్రత్యేక ఆకర్షణ

భక్త సమాజానికి ఆదర్శం చూపుతున్న నెంటూర్ భక్తుల సమిష్టి సేవ

రామకోటి రామరాజును ఘనంగా సన్మానించిన భక్తబృందం

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 5గజ్వెల్:

వర్గల్ మండలంలోని నెంటూర్ గ్రామం ఈసారి గణేశ్ నిమజ్జనంలో ఆధ్యాత్మిక చైతన్యం – సంప్రదాయాల రక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

గ్రామంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించడం, అనంతరం పల్లకిలో ఊరేగింపుగా భక్తులందరూ కలిసి గణపతిని భజనలతో, మంగళహారతుల మధ్య నిమజ్జనం చేయడం – పర్యావరణ పరిరక్షణతో పాటు సాంప్రదాయ పూజా విధానాల పునరుద్ధరణకు సంకేతమని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డుల గ్రహీత రామకోటి రామరాజును హనుమాన్ భక్త బృందం ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేసింది.

రామకోటి రామరాజు మాట్లాడుతూ –

“నెంటూర్ గ్రామం మట్టి గణపతి ప్రతిష్ఠలో రాష్ట్రానికి ఆదర్శం. పల్లకిలో ఊరేగింపుతో జరిగే నిమజ్జనం – ఆధ్యాత్మిక ఏకతకు ప్రతీక” అని అభిప్రాయపడ్డారు.

భక్తబృందం ప్రతినిధులు పేర్కొంటూ –

“రామకోటి రామరాజు నిర్వీరామ రామభక్తి అమోఘం. ఆయన గుర్తింపు, ప్రోత్సాహం మాకు మరింత ఆధ్యాత్మిక బలం ఇస్తోంది” అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version