యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
కామారెడ్డి జిల్లా( ఇన్చార్జ్ )
(ప్రశ్న ఆయుధం) 11 సెప్టెంబర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి క్యూలైన్లో నిల్చోని యూరియా కోసం రైతులకు సరిపడా యూరియా అందడం లేదని ఆగ్రహ వ్యక్తం చేస్తూ సిరిసిల్ల- కామారెడ్డి గంజి గేటు ఎదురుగా రోడ్డు పై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో 200 బ్యాగుల యూరియా అందుబాటులో ఉండగా అంతకు రెట్టింపు మంది రైతులు యూరియా కోసం వచ్చినట్టుగా తెలిపారు. వచ్చిన రైతులకు యూరియా సరిపోదని గ్రహించిన అధికారులు టోకెన్ల ద్వారా రైతులకు యూరియా అందేలా చేస్తామని అదనంగా యూరియా లోడ్ వస్తుందని రైతులందరికీ సరిపడా యూరియాను అందజేస్తామని అన్నారు.