Site icon PRASHNA AYUDHAM

108 అంబులెన్స్ ప్రారంభం. 

అంబులెన్స్
Headlines :
  1. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ సేవలు ప్రారంభం
  2. ప్రజలు అత్యవసర సేవలు సద్వినియోగం చేసుకోవాలి: పోచారం
  3. కాసుల బాలరాజ్ చేతుల మీదుగా 108 అంబులెన్స్ ప్రారంభం
  4. మండల ప్రజలకు అత్యవసర సేవల్లో ముందంజ – పోచారం శ్రీనివాస్
  5. 108 సేవల ఉపయోగం పై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

అత్యవసర సేవలు వినియోగించుకోవాలి.

వ్యవసాయ సలహాదారు పోచారం.

పోతంగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ 108 అంబులెన్స్ ను ప్రారంభించారు. అంబులెన్స్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా పోచారం మాట్లాడుతూ…. అత్యవసర సేవలను మండల ప్రజలు గ్రామాల ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. అంబులెన్స్ అత్యవసరం ఉన్నప్పుడే 108 నెంబర్ ఫోన్ కాల్ చేసి సేవలను వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఏంసి చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్ కోటగిరి సహకార సంఘ అధ్యక్షులు కూచి సిద్దు మాజీ జెడ్పి కోప్షన్ మెంబర్ సిరాజుద్దీన్ ఎంపీపీ పవన్ ఎంపీటీసీ కేశ విరేశం, మాజీ సర్పంచ్ గంట్ల విట్టల్ మాజీ ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు పుప్పాల అభిషేక్ బజరంగ్ దత్తు

కాశగౌడ్ మాణిక్కప్ప మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version