సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఆరోగ్య పరంగా.. ఎమర్జెన్సీ లో ఉన్నపుడు అంబులెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లకు డబ్బులు పెట్టలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు. సిర్గాపూర్ కొత్త మండలమైనా కూడా ప్రజలకు 108 అంబులెన్స్ చేయలేదని అరుణ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పందించి మండల ప్రజలకు 108 సేవలు అందే విధంగా చూడాలని కోరారు.