108 అంబులెన్స్ లో ప్రసవం
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 11, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలోని రామరెడ్డి మండలం పోసానిపెట్ గ్రామానికి చెందిన, బండారు నవనిత, 24 సం”లు, ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణనమే నవనిత ని హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, కష్టపడి అంబులెన్స్ లో సుఖ ప్రసవం చేశారు. మూడవ ప్రసవం కావడంతో మగ బిడ్డకు బొడ్డు తాడు మెడలొ చుట్టూ చుట్టుకొని జన్మించినది తల్లి – బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డి లో చేర్పించారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- ప్రభాకర్, పైలట్- ప్రశాంత్.. లను కుటుంబ సభ్యులు అభినoదించినారు.*