నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 (ప్రశ్న ఆయుధం)

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా చేపడుతున్న ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువును సెప్టెంబర్ 24 వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. తాజా నిర్ణయంతో, ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందారు.

గతంలో నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పొడిగింపు వల్ల అర్హులైన అభ్యర్థులకు ఓపెన్ స్కూల్‌లో చేరేందుకు మరో అవకాశమివ్వడం జరిగింది.

వివరాల కోసం విద్యార్థులు సమీపంలోని ఓపెన్ స్కూల్ కేంద్రాలను లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచు.

Join WhatsApp

Join Now