గ్రూప్-1 ఉద్యోగం సాధించిన తెలంగాణ గిరిజన గురుకుల పూర్వ విద్యార్థి.

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం)సెప్టెంబర్ 27 

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల కామారెడ్డి పూర్వ విద్యార్థి భానోత్ గంగూలీ గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికై ఏ టి ఓగా నియమితుడయ్యాడు. లింగంపేట మండలం, ముంబాజిపేట్ తండాకు చెందిన గంగూలీ 2018–21 బ్యాచ్‌లో కళాశాలలో బిఏ కోర్సు పూర్తి చేశాడు.

ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.ఎల్టీ అడ్డాల నవీన్ కుమార్, సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి, ఆర్‌సి గంగారాం నాయక్, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆయనను అభినందించారు. 2017లో స్థాపితమైన ఈ కళాశాల రెండవ బ్యాచ్ విద్యార్థిగా గంగూలీ రిజల్ట్‌తో కళాశాల ఖ్యాతిని పెంచాడని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now