కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 1 :

కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంకం రాజు పాటిల్, కాట్మొడి సంతోష్ పాటిల్, రజినీకాంత్ పాటిల్ ప్రత్యేకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

జిల్లా కాంగ్రెస్ ను ఐక్యత దిశగా నడిపిస్తున్న నేతగా శ్రీనివాస్ పేరుపొందారని నాయకులు ప్రశంసించారు. పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలపడం జరిగింది.

Join WhatsApp

Join Now