కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షపదవి బి సి లకు వరించేనా…?

కామారెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలి – బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆవాజ్

రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు

బీసీలకు వర్తమానంలోనూ న్యాయం జరగాలని విజ్ఞప్తి

“కులాలు వేరు అయినా రక్తం ఒక్కటే” – బీసీ నాయకుల ఆవేదన

పీసీసీ నేతలు, మమ్మద్ అలీ షబ్బీర్ చొరవ తీసుకోవాలంటూ కోరింపు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 16:

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలంగా డిమాండ్ చేశారు. జిల్లాలోని బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ — కామారెడ్డి పట్టణంలో ఉన్న బీసీ వర్గాలకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేటాయించడం సముచితం అవుతుందని పేర్కొన్నారు.నాయకులు గుర్తుచేస్తూ చెప్పారు: “కామారెడ్డి నేలపై రాహుల్ గాంధీ , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ స్పూర్తిని కొనసాగిస్తూ బీసీలకు న్యాయం చేయడం పార్టీ ధర్మం” అని అన్నారు.బీసీ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఆంగ్లేయుల పాలన నుంచి నేటి వరకు బీసీలకు పూర్తి న్యాయం జరగలేదు. అయితే తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చూపుతున్న ఆత్మీయత ఆధారంగా ఈసారి మా ఆశలు నిజమవుతాయని నమ్ముతున్నాం” అన్నారు.కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకే కేటాయించాలని, అలాగే ఈ విషయంలో పీసీసీ నేతలు మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారు మమ్మద్ అలీ షబ్బీర్ స్వయంగా ముందుకొచ్చి న్యాయం జరిగేలా చూడాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment