కామారెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఏఐటీయూసీ సభ్యుల డిమాండ్
మున్సిపల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి
ప్రశ్న ఆయుధం
కామారెడ్డిజిల్లా అక్టోబర్ 29:
మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి వి. జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిషనర్ రాజేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా AITUC సభ్యులు మాట్లాడుతూ సర్వే సిబ్బంది, ఎలక్ట్రిషన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటేషన్ మరియు వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, స్థానిక పాలక సంస్థలు సీరియస్‌గా పరిగణించాలన్నారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, పండుగ సెలవులు, మహిళా కార్మికులకు స్వయంపాలన వంటి సౌకర్యాలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, ఒకే కార్మికుడికి రెండు మూడు వార్డులు అప్పగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మున్సిపల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. బాలరాజ్, నాయకులు ఎల్. దశరథ్, ఎం. లక్ష్మణ్, నర్సింగ్ రావు, సుదర్శన్, ఆర్. లక్ష్మణ్, జి. రాజు, ప్రకాష్, ఎల్లా రాజు, రాజేందర్ బాబు, ప్రేమలత, వరుణ్, అంబిక, మేఘ, సాయి, వహేబ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.