1,16,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత
ప్రశ్న ఆయుధం జూలై 10: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం,
కూకట్పల్లి నియోజకవర్గం లోని బాలనగర్ కి చెందిన 1) కవిత ఉమ్మగొని వైఫ్ /ఆఫ్ ఉమ్మగొని కరుణాకర్ 56,000 రూపాయల చెక్కు, 2) ఫతేనగర్ నగర్ కి చెందిన ఆర్ .ప్రకాష్ సన్/ ఆఫ్ నరసింహ కి 60,000 రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,16,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మూసాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కుక్కల రమేష్, కిట్టు, మేకల రమేష్, రంగారావు, మురళీధర్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండిరమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.