*మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి (7) రోజుల జైలు శిక్ష*

నిజామాబాద్ నవంబర్ 19 (ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ కేంద్రంలోని 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 18-11-2025 నాడు వర్ని చౌరస్తా దగ్గర ఎం . గంగాధర్. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 5th టౌన్ నిజామాబాద్ తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా షేక్ సుల్తాన్ s/o షేక్ ఉస్మాన్, వయస్సు. 40 yrs, వృత్తి: లేబర్, నివాసం: దారుగల్లి, నిజామాబాద్ అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించి, కోర్టు యందు ప్రవేశ పెట్టగా గౌరవ మేజిస్ట్రేట్ గారు ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. పైన తెలిపిన వ్యక్తిని జైలు కు తరలించడం జరిగింది.

పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ 10,000/- వరకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు కూడా విదించే అవకాశం ఉంది కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని పోలీస్ వారి విజ్ఞప్తి.

ఎం. గంగాధర్,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 5th టౌన్ నిజామాబాద్.

Join WhatsApp

Join Now