Site icon PRASHNA AYUDHAM

IMG 20251203 114646

ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రేమ చాటుకున్న యువ రైతు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 3 

ఆలూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ యువ నాయకులు సిరికొండ సాయి తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పట్ల ఉన్న ప్రేమను తెలియజేయడానికి సాయి తన స్వంత పొలంలో వరి ధాన్యంతో పెద్దఅక్షరాల్లో జై మోడీ, జై బీజేపీ, పీఎం కిసాన్ అని రాసి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ సందర్భంగా సిరికొండ సాయి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వం మా యువతకు ప్రేరణ అని. రైతుల కోసం మోడీ చేస్తున్న సేవలే నాకు ఈ సంకల్పం కలిగించాయి అని తెలిపారు.

Exit mobile version