యస్.సి.వర్గీకరణలో మాదిగలకు 12% రిజర్వేషన్ అమలు జరిగే విధంగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులుపొంగులేటి .శ్రీనివాస్ రెడ్డి ని కోరిన మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర సెక్రటరీ మరియు జిల్లా అధ్యక్షులు:- మోదుగు.జోగారావు,గద్దల.రమేష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు,పేదప్రజల ఆశాజ్యోతి,ప్రజలుమెచ్చిన ప్రజల ఆదరణ పొందిన,ప్రజానాయకులు పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి ని జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి,యస్.సి.వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తూ, మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ అమలు చేయాలని మాదిగ జే.ఏ.సి. రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు.జోగారావు కోరినారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేసిన రాష్ట్ర తొలి యస్.సి.కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి.రవి గారికి నామినేటెడ్ పదవి ఇప్పించాలని మంత్రి ని ఈ సందర్భంలో కోరినారు.ఈ కార్యక్రమంలో మాదిగ జే.ఏ.సి.జిల్లా అధ్యక్షులు గద్దల.రమేష్,మిర్యాల.కిరణ్,ఇసంపల్లి.నాగరాజు,సాయి,యన్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు