వైద్యం కోసం 1,20,000/- రూపాయల ఆర్థిక సహాయం.

కీర్తన మెరుగైన వైద్యం కోసం 1,20,000/- రూపాయల ఆర్థిక సహాయం…

IMG 20240827 WA0136

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా , పరకాల గ్రామానికి చెందిన అనాగొంది సారయ్య – ప్రత్యూష దంపతుల కూతురు కీర్తన ( 3 సంవత్సరాలు ) ఊపిరితిత్తుల సమస్యతో గత 5 రోజుల నుండి అమృత పిల్లల హాస్పిటల్ హనుమకొండలో అత్యవసర చికిత్స పొందుతుంది. ఒక్క రోజుకు సుమారుగా 70,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వైద్యం కోసం ఆర్థిక పరిస్థితి బాగుగాలేనందున , ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , వరంగల్ ఉప్పరపల్లి రాజ్ కుమార్ , ఊరటి రవికుమార్ , గజ్జెల సుమన్ , పోలీస్ కానిస్టేబుల్ పెంతల అశోక్ తన వాట్సప్ సోషల్ మీడియా ద్వారా , వీరి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరడంతో దాతలందరి సహకారంతో ముఖ్యంగా రక్తదాతలు , యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులు , వరంగల్ పోలీస్ శాఖ వారి సహకారంతో సేకరించిన అమౌంట్ 1,00,000 రూపాయల చెక్కు , నగదుగా 20,000/- రూపాయలు మొత్తం అమౌంట్ 1,20,000/- రూపాయలు మెరుగైన వైద్యం కోసం ” అనాగొంది కీర్తన ” తండ్రి అనాగొంది సారయ్య కు ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు. స్విమ్మర్ రాజు , పోలీస్ కానిస్టేబుల్ పెంతల అశోక్ , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , మునిగాల రాము , సృజన , బిటుకూరి యాకయ్య , పాలకుర్తి విష్ణు , ఎస్.కె ముస్తఫా , ఊరటి రవికుమార్ , యాద రవికుమార్ , చెలిమల్ల అశోక్ కుమార్ , తూనం రాము , సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్ , కార్తిక్ , అమర్ , మహేష్ , నగేష్ , చిరంజీవి , భాస్కర్ , సూర్య ప్రకాష్ , శ్రీనివాస్ , మానస , రజిత , రేణుక , శృతి , సతీష్ , రమేష్ , ప్రశాంత్ , అశోక్ , నరేష్ , అనిల్ , రవి , కుమార్ , నవీన్ , చంద్రశేఖర్ , ప్రసాద్ , కుమారస్వామి , కృష్ణ , రవీందర్ , సునీల్ , హరి , బిక్షపతి , శ్రావణ్ , మధు గార్లు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now