ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి..

ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి..

ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 26,కామారెడ్డి :

భూమి కోసం, భుక్తి కోసం పోరాటం సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కాటిపల్లివెంకటరమణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ కమీషనర్ సుజాత, డిఎస్పీ నాగేశ్వర్ రావు, ఇన్చార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now