గాంధారి ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు 13 పతకాల గర్వ విజయాలు
ఇంద్రాగాంధీ స్టేడియంలో మెరిసిన విద్యార్థులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) జులై 30
6 గోల్డ్, 7 సిల్వర్ మెడల్స్ సాధన
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక
హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర పోటీలు..
పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు ఆనందం వ్యక్తం..
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన క్రీడాపోటీలలో గాంధారి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 13 పతకాలు గెలుచుకొని స్కూల్‌కు గర్వకారణంగా నిలిచారు. వీటిలో 6 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ చంద్ర శ్రీవారి మాట్లాడుతూ, ఈ ప్రతిభ ఆధారంగా పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు వచ్చే నెల 3 నుంచి 4వ తేదీ వరకు హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి.
విద్యార్థుల విజయాన్ని చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. “మన స్కూల్ విద్యార్థులు ఇంత గొప్పగా రాణించడం చాలా సంతోషకరం,” అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.