Site icon PRASHNA AYUDHAM

బహుజన లెఫ్ట్ పార్టీ కామారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బా పూలే 134 వ వర్ధంతి

బహుజన లెఫ్ట్ పార్టీ కామారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో

మహాత్మ జ్యోతి బా పూలే 134 వ వర్ధంతి

 కామారెడ్డి 

మహాత్మ జ్యోతి బా పూలే 134 వ వర్ధంతిని పురస్కరించుకుని బహుజన లెఫ్ట్ పార్టీ (బి ఎల్ పి) కామారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద గల జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించరు.

ఈ సందర్భంగా బిఎల్పి పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వడ్ల సాయి కృష్ణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే మహోన్నత సమాజ ఆవిర్భావానికి అహోరాత్రులు శ్రమించిన బహుజన శ్రామిక జన బాంధవుడు ,కోట్లాది బహుజన ప్రజల కొరకు పరితపించిన మేధావి, ఆధునిక భారత సామాజిక విప్లవోద్యమ నిర్మాత బ్రాహ్మణాధిపత్య దోపిడీ వ్యవస్థ సృష్టించిన అసమానతల కుల వర్గ” దోపిడీ వ్యవస్థ పై నిత్యం తిరుగుబాటు చేసిన నాయకుడు.

గులాం గిరి అనే పుస్తకాన్ని రచించి అక్షరమే ఆయుధంగా అజ్ఞానపు బానిసత్వ సంకెళ్ళ లపై సమరభేరీ మోగించిన సామ్యవాది సామ్రాట్ అశోక చక్రవర్తి వారసత్వానికి ప్రతిబింబమైన విశ్వజ్ఞాని ఆధునిక గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి గురువుగా స్వీకరించరు, పూలే ఆశయ సాధన కై బి ఎల్ పి పార్టీ ఉద్యమిస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ పి పార్టీ కామారెడ్డి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గంగామని, బి ఎల్ ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకుడు చౌకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version