ఘనంగా 139వ మేడే ఉత్సవాలు

*ఘనంగా 139వ మేడే ఉత్సవాలు*

*కార్మికుల హక్కుల కోసం పోరాటాలే స్ఫూర్తిగా తీసుకోవాలి*

*సిఐటియు జిల్లా కార్మిక నాయకులు చెల్పురి రాము*

*ఇల్లందకుంట మే 1 ప్రశ్న ఆయుధం*

IMG 20250501 WA3169 కార్మిక దినోత్సవ మేడే ఉత్సవాలను సిఐటియు కార్మిక విభాగం ఇల్లందకుంట మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధ సంఘాలైన హమాలి కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, గ్రామపంచాయతీ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల, ఆధ్వర్యంలో మల్యాల, శ్రీరాములపల్లి, వంతడుపుల, ఇల్లందకుంట గ్రామాల్లో మేడే ను పురస్కరించుకొని జెండా ఆవిష్కరణలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చెల్పూరీ రాము మాట్లాడుతూ ప్రపంచ కార్మికులను ఏకం చేసే దిశగా 19వ శతాబ్దంలో 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం ఉండాలని జరిగిన సమ్మెలో అనేకమంది కార్మికులు పాల్గొనడం జరిగిందని ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులపై అమెరికా ప్రభుత్వం కాల్పులు జరిపి అనేకమంది కార్మికులను తూటాలతో సంహరించడం జరిగిందని వారి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై మే 1న మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు భారతదేశంలో కూడా లక్షలాది మంది కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మికుల పొట్ట కొట్టడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామన్నారు దేశంలో కార్మికుల కోసం భారత రాజ్యాంగం 44 కార్మిక చట్టాలను కేటాయిస్తే ఈమధ్య కాలంలో 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 44 కార్మికుల చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లు గా చేయడం జరిగిందని దీంతో పాటు దేశంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలైన ఆదాని,అంబానీలకు వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ప్రపంచ కార్మికుల స్ఫూర్తితో కార్మికులు కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మే 20 తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి హక్కుల కోసం పోరాటం చేయాలి అని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో. రైతు సంఘం మండల సహాయ కారదర్శి తిప్పరపోయిన శ్రీకాంత్, సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం, నాయకులు రమేష్, గురుకుంట్ల కట్ట స్వామి, రాజేందర్, భవన నిర్మాణ కార్మిక సంఘం జమ్మకం వెంకన్న, రావుల ఎల్లయ్య, సారయ్య, శ్రీనివాస్, రవి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి కొత్తూరు మల్లయ్య, రాజు, సంపత్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now