కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో 13వ టీజీవిపి ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 30
తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీబీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో 13 వ టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ మాట్లాడుతూ టీజీవిపి తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ అవిర్భవించిన సంఘం అన్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో టీజీవిపి న్యాయం కోసం, విద్యా రంగ అభివృద్ధి కోసం, విద్యార్థి హక్కుల కోసం తిరుగులేని పోరాటం చేసి తన ప్రత్యేకతను నిలబెట్టుకుందన్నారు.
టీజీవిపి ద్వారా పోరాడిన ప్రతి విద్యార్థి సమస్య అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ జాప్యం, కాలేజీల్లో అవకతవకలు, నకిలీ కాలేజీలు, నిరుద్యోగ సమస్యలు, ఇవన్నింటిపై టీజీవిపి గళం విప్పి, కార్యాచరణ చేపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ రోజు టీజీవిపి ఒక ఉద్యమ విద్యార్థి సంఘంగా యువత ఆశయాలకు ప్రతీకగా మారిందన్నారు. భవిష్యత్ లోనూ విద్యార్థుల సంక్షేమం కోసం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ సాయి, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.