వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం
భారతీయ జాతీయ గీతం వందేమాతరం సామూహిక గానం
నవంబర్ 7న ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం.
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 06
భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు ఈ దేశభక్తి గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, భారత ప్రభుత్వం ఈ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో నవంబర్ 7, శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా, ప్రతి కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయం, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో సామూహికంగా “వందేమాతరం” గానం నిర్వహించనున్నట్లు కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా IDOC కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ –ఈ కార్యక్రమం ద్వారా భారత జాతీయ గీతానికి గౌరవప్రదమైన నివాళి అర్పించడం, ప్రజల్లో దేశభక్తి భావనను బలపరచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోని అన్ని కార్యాలయాలు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.