హైదరాబాద్ ఉప్పల్ మండలంలో 1589 అక్రమ నిర్మాణాలు..!
హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.ఉప్పల్ మండలం పరిధిలో ఏకంగా 1589 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు..