Headlines in Telugu:
-
15వ జిల్లా మహాసభలు: సిపిఐ(ఎం) ప్రతినిధుల పిలుపు
-
రైతుల, కార్మికుల సమస్యలపై చర్చించనున్న సిపిఐ(ఎం)
-
నవంబర్ 2,3: తూప్రాన్ పట్టణంలో మహాసభలు
●జిల్లా కార్యదర్శి ఏ మల్లేష్
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 30 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
నవంబర్ 2,3 తేదీ లలో తూప్రాన్ పట్టణంలో
సిపిఐ(ఎం) మెదక్ జిల్లా 15వ మహాసభలను జయప్రదo చేయాలనీ సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఏ మల్లేష్ పిలుపునిచ్చారు.ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కార్మికుల, రైతులు, పేదలు, కూలీలు, మహిళలు, దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన సిపిఐ(ఎం) పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో కార్మికులకు కనీస వేతనాలు చట్టపరమైన హక్కులు కావాలని ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్న పార్టీగా సిపిఐ(ఎం) ఉందని తెలిపారు. జిల్లాలో రైతుల ఎదుర్కొంటున్న ధరణి, భూ సమస్యల పరిష్కారం చేయడం రైతాoగo తరుపున నిలబడి పోరాటం చేసిందినరూ.దళితులు,మహిళలు, ఇతర వర్గాల సమస్యల పైన సిపిఐ(ఎం) నిరంతరం చేసిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్న సీపీఐ(ఎo) మహాసభలను జయప్రదo చేయడం కోసం మెదక్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కూలీలు ,ప్రజలు, కార్మికులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా మహాసభల కు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు , రాష్ట్ర కమిటీ సభ్యురాలు జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ గారు సంగారెడ్డి సిద్దిపేట పార్టీ జిల్లా కార్యదర్శిలు మరియు ఎంపిక కాబడిన ప్రతి నిధులు హాజరవుతారని తెలియజేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ,ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను తీసుకోవడం జరుగుతుందన్నారు. మహాసభల ను విజయవంతం చేయాలని ఏ. మల్లేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏ. మహేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,తూప్రాన్ ఏరియా కమిటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.