విజయవాడ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు, శాఖాధిపతులు ఆ సమస్య ఉన్న ప్రదేశానికి స్వయంగా విచ్చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని ఇస్తున్నారని, ఒకవేళ ఆ సమస్య విభిన్న శాఖల సంబంధించిన అయినప్పటికీ శఖాధిపతుల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 16 ఫిర్యాదులలో అత్యధికంగా పట్టిన ప్రణాళిక కు సంబంధించినవి తొమ్మిది కాగా ఇంజనీరింగ్ సంబంధించినది 4, రెవెన్యూ, ఎస్టేట్, ప్రజారోగ్యం సంబంధించినవి ఒకటి ఉన్నాయి.ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విజయవాడ కమిషనర్ ధ్యాన చంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ. మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే.వీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)జి.సృజన, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజీ సూర్యకుమార్, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మాల్యాద్రి, జాయింట్ డైరెక్టర్ ( అమృత్) డాక్టర్ లత తదితరులు పాల్గొన్నారు..