నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 27:
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది.
ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో కీలకంగా ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ పై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశనిర్దేశం చేయడంతో పాటు , తెలంగాణ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందన్నారు. తెలంగాణకు చెందిన 18 మంది బిజెపి ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం, కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బిజెపి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని తెలిపారు.