సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయ భవన సముదాయంలో ప్రత్యేక సహాయక కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేయబడినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో —జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీటీసీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ), ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ మరియు ఇతర ఎన్నికల సంబంధిత విషయాలపై సమాచారం, ఫిర్యాదులు, దరఖాస్తుల స్వీకరణ కొరకు ఈ కేంద్రం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్ 8125352721 ద్వారా 24×7 సహాయక సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రస్తుతం అమలులో ఉందని, ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు పైనంబర్ ద్వారా తెలియజేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదులు, సమాచారానికి సంబంధించి, సహాయక కేంద్రాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సహాయక కేంద్రం ఏర్పాటు: జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_131072