20 కోట్ల బీజేపీ సభ్యత్వం ప్రస్తుత లక్ష్యం
–ఇప్పటికే 7 కోట్ల సభ్యత్వం పూర్తయ్యింది
– దేశంలో తెలంగాణ, తెలంగాణలో కామారెడ్డి ముందంజలో ఉండాలి
– ఎమ్మెల్యే, ఎంపీ నాయకుల నుండి బూత్ స్థాయి కార్యకర్తల వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి
– బూత్ కి 200 సభ్యత్వం తప్పని సరి
– గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్న ఎక్కువ సభ్యత్వం చేయాలి
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా పర్యటనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచ్చేసిన సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి జయప్రకాష్ నారాయణ విగ్రహం వరకు గల వ్యాపార సముదాయాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్స్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ… 20 కోట్ల బీజేపీ సభ్యత్వం ప్రస్తుత లక్ష్యమని ఇది పార్టీ నాయకత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 7 కోట్ల సభ్యత్వం పూర్తి అయ్యిందనీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందని దేశంలో తెలంగాణ, తెలంగాణలో కామారెడ్డి ముందంజ లో ఉండాలినీ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ నాయకుల నుండి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలనీ సూచించారు. బూత్ కి 200 సభ్యత్వం తప్పని సరి చేయాలని అన్నారు. ప్రతి బూత్ లో గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్న ఎక్కువ సభ్యత్వం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, నాయకులు మురళీధర్ గౌడ్, ఆలే భాస్కర్, చిన్న రాజులు, రంజిత్ మోహన్, కృష్ణా రెడ్డి, రాంరెడ్డి, రవీందర్ రావు, లక్మారెడ్డి, లింగారావు, మోటూరి శ్రీకాంత్, కానకుంట గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.