ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముకుల గ్రామ శివారులో ట్రాలీ ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను నర్సాపూర్ హాస్పిటల్ కు తరలించారు. ఇందులో పదిమంది హెల్కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కస్టోడి భూముల్లో పొలం పనులు చేయడానికి వెళ్తున్నారు. వీరంతా చిన్న గొట్టి ముక్కుల గ్రామానికి చెందినవారిని గుర్తిం చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.