20 లక్షలు కాజేసిన ఆర్పి కృష్ణ లీలపై చర్యలు తీసుకోవాలి
శివశంకర్ డ్వాక్రా గ్రూప్ సభ్యులను మోసం చేసి 20 లక్షలు కాజేసిన
ఆర్పి కృష్ణ లీలపై చర్యలు తీసుకొని, డబ్బులు రికవరీ చేయాలి
మెప్మా పీడీ కి పిర్యాదు చేసిన గ్రూప్ సభ్యులు…
ప్రశ్న ఆయుధం సిద్దిపేట ఏప్రిల్ 22 :
గజ్వేల్ పట్టణం కు చెందిన శివశంకర్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు . ఒక రోజున ఆర్పీ కృష్ణ లీల మరియు మంజుల కలిసి వచ్చి ఒకరికి ఒకరు పరిచయం లేని వ్యక్తులమైన మమ్మల్ని ఫోటో స్టూడియో వద్దకు తీసుకెళ్లి గ్రూపు ఫోటో తీయించి మీ అందరికీ 20 లక్షల రూపాయల రుణం వస్తుందంటూ తెలిపి మా యొక్క ఆధార్ కార్డు తీసుకుని అందరితో అదే రోజున యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంకు ) లో వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది గ్రూపు అవసరాల నిమిత్తం అంటూ తెలుపుతూ ఎలాంటి తీర్మానం రాయకుండానే కాళీ గ్రూప్ పుస్తకాలలో మరియు ఖాళీ ఓచర్లపై అందరితో సంతకాలు చేయించుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత రుణం ఏమైందంటూ వ్యక్తులుగా ఆర్ పి కృష్ణ లీలను అడగగా రుణం రాలేదని, బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్ అని తెలపడం జరిగింది, మంజుల రుణం విషయం మర్చిపోవాలని కొద్దిమందిని బెదిరించింది. గ్రామ సమైక్య సంఘం ద్వారా, శ్రీనిధి ద్వారా 40 వేలు, 22,000 రూ, లను కొద్ది మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రూప్ సభ్యులను పరిచయం చేయలేదు, సమావేశాలు జరగలేదు నేటి వరకు కూడా మా గ్రూప్ సభ్యులను ఒకరికి ఒకరం పరిచయం లేము. కావున మమ్ములను మోసం చేసి మా గ్రూప్ పేరుతో 20 లక్షల రూపాయలు మింగిన ఆర్పీ కృష్ణ లీలపై చర్యలు తీసుకోవాలని మొత్తం డబ్బులను రికవరీ చేయాలని, మా పేరుతో ఉన్న రుణాన్ని రద్దు చేయాలని పీడీ హన్మంత్ రెడ్డి కి పిర్యాదు చేశారు . ఈ కార్యక్రమంలో శివశంకర్ గ్రూపు సభ్యులు స్వప్న, జ్యోతి, అనసూయ, శివాని, సాహితీ, బాలమని, రజానా తదితరులు పాల్గొన్నారు.