అంధుల అక్షర ప్రదాత డా||లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకల నిర్వహించిన విజ్ఞాన్ వికలాంగుల సేవాసమితి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అంధుల అక్షర ప్రదాత డా||లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను కేక్ కట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ పుట్టుకతో అంధుడు కాకపోయినా వృత్తి రీత్యా పిన్నవయసులో వడ్రంగి పని చేస్తుండగా వారి రెండు కళ్ళు పోయి వారి మేధస్సుతో బ్రెయిలీ లిపి కొనుక్కుని ప్రపంచంలో స్పూర్తి పొందడం అభినందనీయం అన్నారు. ఇదే స్ఫూర్తితో దివ్యాంగుల సమాజం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గొంతుగా ఏర్పడాలని, ఆ రోజే దివ్యాంగుల భౌషత్ అవసరాలు పరిష్కారం కావాలంటే దివ్యాంగుల సంఘాలు ఏకం కావాలి అన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 6000/- పెన్షన్, ఉచిత రావాణా సౌకర్యం, దివ్యాంగుల చట్టం 2016అమలు, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ, ఉన్నత విద్య ఉద్యోగాల రిజర్వేషన్లు,5 శాతం నిధులు, ఇందిరమ్మ ఇళ్లు, అంత్యోదయ రేషన్ కార్డులు, పూర్తి సంక్షేమ పథకాల్లో అర్హులైన దివ్యాంగులను గుర్తించాలని కోరారు.
ఈకార్యక్రమంలో నాయకులు పంగ ఈశ్వర్, గాడి నర్సింలు, నితీష్ రెడ్డి, బంటు స్వామి,బంజ రాజు,జైనోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.