Site icon PRASHNA AYUDHAM

ఒకేసారి వికశించిన 22 బ్రహ్మ కమలాలు…

IMG 20250719 WA1793

*ఒకేసారి వికశించిన 22 బ్రహ్మ కమలాలు..*

*షాద్ నగర్ లో గుత్తులు గుత్తులుగా బ్రహ్మ కమలాలు*

బ్రహ్మ కమలం ఒక దైవిక పుష్పం. ఇది చాలా అరుదైన పుష్పం.. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేకత దీనికి ఉంది. బ్రహ్మ కమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ అరుదైన పుష్పం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో

సునీత, వెంకట్ రెడ్డి దంపతుల

ఇంట్లో ఒకేసారి గుత్తులు గుత్తులుగా 22 పుష్పాలు వికశించి చూపరులను ఆకట్టుకుంది. ప్రకృతిలో రకరకాల పువ్వులున్నాయి. అటువంటి పువ్వుల్లో ఒకటి బ్రహ్మ కమలం. ఈ పువ్వులకు హిందూ మతంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. హిమాలయాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. మొగ్గ తొడిగిన తర్వాత రెండు, మూడు వారాలకు ఈ బ్రహ్మ కమలం వికశిస్తుంది. అయితే ఈ అరుదైన పుష్పం రాత్రి సమయంలో మాత్రమే వికశిస్తాయి. ఉదయం వాడిపోతాయి. అయితే బ్రహ్మ కమలాలు వికశించినప్పుడు వచ్చే పరిమళం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉన్న ఈ బ్రహ్మ కమలం ఒకేసారి పదుల సంఖ్యలో వికశించి చూపరులను ఆకట్టుకున్నాయి.

సునీత వెంకట్ రెడ్డి దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పాలు వికసించి ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 పుష్పాలు విరబూసాయి. గతంలో ఇదే మొక్కకు కొంచెం తక్కువ పుష్పాలు వికశించాయి. ఈసారి మాత్రం పువ్వులు విరగబుశాయి.

ఈ పువ్వులు పూచిన ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నమ్మకం. అయితే రాత్రి సమయంలో పూసే ఈ పువ్వులు సూర్యోదయానికి ముందే వాడిపోతాయి. బ్రహ్మ కమలం వికసించే ప్రదేశం పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటంతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు బ్రహ్మ కమలం వికసించిన ఇంట్లో అప్పటి వరకూ ఉన్న సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం…

Exit mobile version