రూ. 22 లక్షల గంజాయి పట్టివేత ఎక్సైజ్ శాఖ
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 12 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం.
కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు..
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ పట్టుకున్నారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ.22 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక అద్దెకారును కిరాయికి తీసుకొని కారులో ఒరిస్సా ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి కారులో 43 కిలోల గంజాయిని తీసుక వస్తు ఉండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కు పట్టుబ డ్డాడు.
సురేందర్ సింగ్ (23) రాజ్‌కోట్, రాజస్థాని స్వంత స్వగ్రామం. కాని చాల కాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్న సురేందర్ గత కొంత కాలంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడని విచారణలో వెల్లడయ్యింది.
భధ్రాచలం ఇసుక స్టాండ్ సమీపంలో ఎన్‌ఫొర్స్‌మెంట్ ఖమ్మం టీమ్ ఎస్సై శ్రీధ`ర్‌రావు,హెడ్‌కానిస్టేబుళ్లు ఎంఏ ఖరీమ్,జి బాలు, కానిస్టేబుళ్లు వెంకట్,సుధీర్, హరిష్, వీరబాబు,ఉపేందర్‌లు కలిసి పక్కా సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణకు చెందిన కారులో గంజాయిని స్వాధీనం చేసుకొని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.గంజాయిని పట్టుకున్న ఖమ్మం ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌ను ఎన్‌ఫొ ర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, ఏసీ ఎన్‌ఫొర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి .గణేష్ అభినందించారు.