ఆయుష్ విభాగం ఉద్యోగి కుటుంబానికి 22,000 ఆర్థిక సహాయం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
నిజామాబాద్ జిల్లాలో ఆయుష్ విభాగం లో ఆర్మూర్ నివాసి గడ్డమీది గిరిరాజ్ పిహెచ్సి నందిపేట్, నిజామాబాద్ లో ఎస్ ఎన్ ఓ గా విధులు నిర్వహిస్తున్న అతను కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి కామారెడ్డి హాయ్ సువ్వి వేగ ఉద్యోగులు 22 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పది రోజుల క్రితం అతను గుండె పోటు తో అకాల మరణం చెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. వారికి కామారెడ్డి జిల్లా ఆయుష్ విభాగం లో విధులు నిర్వర్తిస్తున్న వారు వారి కుటుంబానికి రూ – 22000 /- ఆర్థిక సాయం అందజేశారు. ఈ రూపాయలను బుధవారం దోమల శ్రీధర్,ప్రసాద్ లు కామారెడ్డి జిల్లా నుండి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించరు.