Site icon PRASHNA AYUDHAM

24 మంది ఏఎస్ఐలకు సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి

IMG 20250116 191537

Oplus_131072

*పదోన్నతి పొందిన ఎస్ఐ లను అభినందించిన ఎస్పీ చెన్నూరి రూపేష్*

 

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాకు చెందిన 24-మంది ఏఎస్ఐలకు ఎస్ఐ లుగా పదోన్నతి కలిస్తూ గౌరవ మల్టీ జోన్- II ఐజి వి.సత్యనారాయణ ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, సుధీర్గ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా సబ్-ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన అధికారులందరినీ జిల్లా ఎస్పీ అభినందించి, ఎస్ఐ ర్యాంక్ చిహ్నంను అలకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచే విధంగా చూడాలని, సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, రోజు వ్యాయామం చేయాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా సమర్దవంతంగా నిర్వహించగలమని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలమని తెలిపారు. మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి శారీరక శ్రమ, యోగా అవసరమని ఎస్పీ రూపేష్ పేర్కొన్నారు.

Exit mobile version