వీధి కుక్కల దాడిలో 25 మందికి గాయాలు
గాయపడిన వారిలో ఐదుగురు 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు
మెదక్ జిల్లా తూప్రాన్‌లో 25 మందిపై దాడి చేసిన వీధి కుక్కలు
వీరిలో 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు ఐదుగురు ఉండగా, తీవ్రంగా గాయపడిన అనిరుధ్(3) అనే చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించిన అధికారులు
వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించామని తెలిపిన అధికారులు
ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు…