గాంధారిలో పవన్ యూత్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం
ప్రశ్న ఆయుధం, ఆగస్టు 30 (కామారెడ్డి జిల్లా గాంధారి)
గాంధారి మండల కేంద్రంలో పవన్ యూత్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం ఘనంగా కొనసాగుతోంది. గణేష్ మండపం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది.
శనివారం నాలుగవ రోజు అన్నదానంలో గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిసా గణేష్ ముందుండి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువజన సంఘ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదం స్వీకరించారు.
పవన్ యూత్ సభ్యులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. గ్రామస్థులు ఈ నిరంతర అన్నదానం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.