డ్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మంది పట్టుబాటు
— నలుగురికి జైలు శిక్ష, మిగతావారికి జరిమానా
— ఇన్‌స్పెక్టర్ నరహరి కౌన్సిలింగ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
కామారెడ్డి జిల్లా లో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. విచారణలో నలుగురికి ఒక్క రోజు చొప్పున జైలు శిక్ష విధించగా, మిగతా వారికి జరిమానా విధించారు. అనంతరం పట్టుబడిన వారికి కామారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్ బి.నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.