2 వరోజు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు,సాధనకై ధర్మసమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్ష..

2 వరోజు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు,సాధనకై ధర్మసమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్ష..

– ప్రశ్న ఆయుధం -కామారెడ్డి

పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ఈ బీసీ ప్రజలందరికి విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా నాయకులు లక్ష్మణ్ మహారాజ్, రాజు లు మాట్లాడుతూ 2 వరోజు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థి నాయకులు, మద్దతు తెలపడం జరిగిందన్నారు. ప్రజలందరికీ న్యాయమైన ఉచిత, విద్య, వైద్యం, భూమి, ఇల్లు సాధించేంతవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోలేశ్వర్ కో కన్వీనర్ అరవింద్ జిల్లా నాయకులు, రాజు,కవిన్, మీడియా ఇంచార్జి రాజు, రాజశేఖర్, సాయి, మురళి,మహేష్, పర్శరాములు, ప్రభాకర్, శివరామకృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now