జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా అంతట 30 పోలీస్ యాక్ట్ 1861 అమలు

*జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా అంతట 30 పోలీస్ యాక్ట్ 1861 అమలు*

*నిర్మల్ -డిసెంబర్ 31:-* నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతతను పెంపొందించేందుకు 01 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో కొన్ని అంశాలను తెలిపే ప్రయత్నం చేశారు. ఈ నెల మొత్తం 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు పేలుడు పదార్థాలులు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధాలను వాడరాదన్నారు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు సమూహంగా జనాలు గుమిగూడి ఉండడం వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధమని తెలుసుకోవాలన్నారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 కింద శిక్షార్హులు అవుతారని ఎస్పి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now