విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ వేడుకలు

*విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలి*

*విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ వేడుకలు*

*IMG 20250304 WA0096

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*జమ్మికుంట మార్చి 4 ప్రశ్న ఆయుధం*

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు గొప్ప పేరు తేవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోని విద్యోదయ విద్యాసంస్థల 32 వ వార్షికోత్సవ వేడుకలు, పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ విద్యోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఏబూసి రామస్వామి మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయనకు తనకు ఉన్న స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తు చేశారు పాఠశాల అభివృద్ధికి రామస్వామి చేసిన కృషిని కష్టాన్ని సేవలను పాఠశాల నిర్వహణ గూర్చి వివరించారు. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యోదయ విద్యాసంస్థలు ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాలలో వెలుగులు నింపి వారి ఉన్నతికి కృషి చేశారని వివరించారు విద్యోదయా పాఠశాల డైరెక్టర్ తన తండ్రి ఏబూసి రామస్వామి 45 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించి 3,500 మంది విద్యార్థులుగా అభివృద్ధి చెందుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలు విద్యాభిమానుల శ్రేయోభిలాషుల ఆశీస్సులు తనకుంటే తండ్రి రామస్వామి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తానని రామస్వామి లేని లోటును తీర్చలేకపోవచ్చు కానీ తనవంతు కృషి చేస్తానని తల్లిదండ్రులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పాటల పోటీలు క్విజ్ పోటీలు లాంటి రకరకాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులు అలదించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. తదనంతరం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ జమ్మికుంట సీఐ వరంగoటి రవి ఎంఈఓ హేమలత విద్య ఉదయ విద్యాసంస్థల డైరెక్టర్లు జ్యోతి, ఆర్యన్ కౌశిక్, అకాడమిక్ డైరెక్టర్ మహాలక్ష్మి, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now