సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ఫసల్ వాది సమీపంలోని ఎం.ఎన్.ఆర్ కళాశాలలో గురువారం ఎం.ఆర్.ఎఫ్. కంపెనీ సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాలో 35 మంది ఎంపికయ్యారని కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ రఘురాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగారెడ్డి సమీపంలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఖాళీలకు జాబ్ మేళా ఎంఎన్ఆర్ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించగా, 35 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్. నగేష్, కంపెనీ ప్రొడక్షన్ ఇంచార్జ్ వినోద్, ప్లెస్మెంట్ ఆఫీసర్ మమత తదితరులు పాల్గొన్నారు.
Latest News
