సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు

*ఘనంగా బహుజన ఉద్యమ కారుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 వ జయంతి వేడుకలు*

*మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్ తక్కళ్లపల్లిరాజేశ్వర్ రావు దేశిని స్వప్న కోటి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 18*

జమ్మికుంట మున్సిపాలిటీలోని మడిపల్లి క్రాస్ వద్ద బహుజన ఉద్యమ కారుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జమ్మికుంట లో మడిపల్లి క్రాస్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పువ్వుల మాలలు వేసి కేక్ చేసిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చిన్ననాటి నుండే పెత్తందారుల పోరు భరించలేక తిరుగుబాటు చేసి 12 మందితో గెరిల్లా సైన్యం మొదలుపెట్టి అందులో అన్ని కులాల నాయకులను తీసుకొని 12వేల గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి పోరాటం చేసి విజయం సాధించి గోల్కొండ రాజుగా కొన్ని సంవత్సరాలు పాలించాడని తన పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని మంచిగా పాలిస్తున్న తరుణంలో కొంతమంది పెత్తందారులు భూస్వాములు ఒక్కటై తనపై తిరుగుబాటు చేసి తన ఓడించడం జరిగిందని 300 సంవత్సరాల క్రితమే పోరాటం చేసిన గొప్ప నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన ఆశయాలను కొనసాగాలని పిలుపునిచ్చారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య కౌన్సిలర్లు బొంగోని వీరన్న మారేపల్లి బిక్షపతి శ్రీపతి నరేష్ పొన్నగంటి సారంగం దేశిని రాధా సదానందం దీప్తి కిషన్ రెడ్డి కార్యక్రమ నిర్వాహకులు ఆరెల్లి మల్ల గౌడ్ ప్రభాకర్ గౌడ్ రాజు గౌడ్ నాగపురి రమేష్ గౌడ్ విజయ్ గౌడ్ కృష్ణ గౌడ్ పూదరి రేణుక శివ గౌడ్ మల్లారెడ్డి మధు రామ్మూర్తి గౌడ్ బొంగోని సదానందం గౌడ్ బుర్ర సంపత్ గౌడ్ అజయ్ గౌడ్ పంజాల అనిల్ గౌడ్ గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now