*పర స్త్రీని తన తల్లిగా భావించిన మహా పురుషుడు చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు*
*అరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస్*
*ఇల్లందకుంట ఫిబ్రవరి 19 ప్రశ్న ఆయుధం*
మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తాలో పర స్త్రీని తన తల్లిగా భావించిన మహా పురుషుడు చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలను ఆరే సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయలు సమర్పించి పతాక ఆవిష్కరణ చేయడం కేకు కట్ చేసి కేకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు చేసిన కృషిని కొనియాడారు దేశంలోని పర స్త్రీలను తన తల్లిగా భావించే మహా పురుషుడు అని గెరిల్లా యుద్ధ నీతితో తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడని గొప్ప దైవభక్తి గల యోధుడని శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహంతో సామ్రాజ విస్తరణ కావించాడని స్వయంగా అమ్మవారు తనకు ఖడ్గం ప్రసాదించినట్లు పూర్వీకులు చెప్పడం జరిగిందని అలాంటి దైవ అనుగ్రహం కలిగిన మహా యోధుడు సామ్రాజ్య స్థాపకుడు అనేక రాజులతో సఖ్యత కలిగిన రాజుగా చత్రపతిగా బిరుదు అంకితం కాబడిన వ్యక్తి అని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చత్రపతి శివాజీ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం హిందూ పక్షపాతినేని అని చెప్పుకోవడం జరుగుతుంది కానీ హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడిన మహాత్ముని యొక్క జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే శివాజీ జయంతిని వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని ఇల్లందకుంట మండల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు తిప్పారపు వీరన్న డివిజన్ ఇంచార్జ్ ఇంగిలే ప్రభాకర్, గైకోటి రాజు, కరటపల్లి రాజు, ఎర్రబాటి రమేష్, రవికుమార్, శ్రీనివాస్, బాబురావు, రమేష్ తో పాటు ఆరెకుల బాంధవులు పాల్గొన్నారు.